wife-spots-50

50 wifi centres in Hyderabad

50 wifi centres in Hyderabad
సిటీలో 50 ఫ్రీ wiFi సెంటర్స్

హైదరాబాద్ నగరంలో కొత్తగా 50 ప్రాంతాల్లో WiFi హాట్ స్పాట్ లను ఏర్పాటు చేసేందుకు సిద్దమైంది బీఎస్ ఎన్ ఎల్. ఇప్పటికే 40 చోట్ల ఫ్రీ వైఫై సేవలు అందిస్తోంది. రద్దీ ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. సిటీలో 238 చోట్ల యాక్సెస్ పాయింట్ల్ ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం ఎల్ అండ్ టీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. 2015 నుంచి పరిమిత వైఫై సేవలను వినియోగించుకుంటున్నారు నగరవాసులు. హాట్ స్పాట్ వేగం 4జీ కంటే 4.5జీ స్పీడ్ ను అందిస్తున్నట్టు వెల్లడించింది BSNL. సిటీలో 2వేల హాట్ స్పాట్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఐటీ మినిష్టర్ కేటీఆర్ ఇదివరకు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇప్పుడున్న వాటికంటే మరో 50 కొత్త ప్రదేశాల్లో ఈ వైఫై సేవలను అందించడానికి సిద్దమైంది ఈ సంస్థ.

జియో రాకతో ఫ్రీ వైఫై హాట్ స్పాట్ వినియోగం తగ్గినట్టు తెలుస్తోంది. క్వాడ్ జెన్ సహకారంతో BSNL అందిస్తోన్న 40 ఫ్రీ వైఫై హాట్ స్పాట్ ప్రదేశాల్లో గతేడాది 3.46 లక్షల సార్లు ఈ సేవలను వినియోగించుకున్నారు. ఇందులో 1.51 లక్షల మంది 62.19 లక్షల జీబీని వినియోగించుకున్నారని ప్రకటించింది బీఎస్ఎన్ఎల్. డిసెంబర్ తర్వాత WiFi సేవల వినియోగం తగ్గిందని వెల్లడించింది. ఇక్కడ మొదటి మూడు సార్లే ఫ్రీగా వైఫై అందిస్తోంది. ఆ తర్వాత వినియోగదారులు రీఛార్జ్ చేసుకోవాల్సిందే.

Post Author: