mahabharath

Mahabharath movie with 1000 crores?

వెయ్యికోట్ల మహాభారతం..
దాదాపు రెండున్నరేళ్లకిందట తొలివెలుగు చెప్పింది ఇప్పుడు నిజం కాబోతోంది. వి.ఎ శ్రీకుమార్ మేనన్. హైలీ టాలెంటెడ్ యాడ్ ఫిల్మ్ మేకర్ గా పేరు. శ్రీకుమార్ ఆధ్వర్యంలో ఓ మహాద్భుతం జరగబోతోంది. భారతీయ సినీ చరిత్రలో ఎన్నడూ లేనంతగా వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడితో ‘ది మహాభారత’. ఈ సినిమా రూపుదిద్దుకునేందుకు రంగం సిద్దమైంది.
యూ.ఏ.ఈ కి చెందిన ఓ భారతీయ వ్యాపారవేత్త ఈ సినిమాకోసం ఏకంగా రూ.1000 కోట్ల పెట్టుబడి పెడుతున్నాడు. ఈ సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కించనున్నారు. మొదటగా ఈ సినిమాని ఇంగ్లీష్, హిందీ, మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు భాషల్లో తెరక్కిస్తారు. ఆ తర్వాత 100 విదేశీ భాషల్లో డబ్బింగ్‌ చేస్తారు. టాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌ వరకు స్టార్ కాస్ట్ ఉంటుంది.

ఓ హాలీవుడ్ డైరెక్టర్ నటీనటుల ఎంపిక చేయబోతున్నారు. ఈ మహాభారతం ప్రముఖ రచయిత ఎం.టి వాసుదేవన్‌ నాయర్‌ రాసిన ‘రాందమూళం’ నవల ఆధారంగా తెరకెక్కబోతోంది. భీముడి పాత్రమీద ఎక్కువ ఫోకస్ చేయబోతోన్న ఈసినిమాని వచ్చే ఏడాది స్టార్ట్ చేసి 2020 నాటికి రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.

Post Author: