allu-aravindh-accupaid-gpsk-theaters-1-678x381

Allu aravind accupaid balakrishna GPSK theatres

Allu aravind accupaid balakrishna GPSK theatres
బాలయ్య గౌతమీపుత్ర శాతకర్ణి థియేటర్స్ పై అల్లు అరవింద్ పంజా..

సంక్రాంతి పండుగ వస్తే కోడి పందేలు గుర్తుకువస్తాయి .కాని అదే సంక్రాంతికి చిరు ,బాలయ్య కలిసి పోటికి వస్తే ? అది ఇండస్ట్రీ కి కనక వర్షమే .. బాలయ్య,చిరంజీవి ఇప్పటికి 19 సార్లు పోటీ పడగా బాలయ్య అందులో 13 సార్లు విజయం బాలయ్య వశం కాగ చిరు 6 సార్లు విజయం సాధించాడు .అందులో బాలయ్యకు పోటీ గా చిరు సంక్రాంతికి వచ్చిన ప్రతిసారి అపజయం పొందిన విషయం విదితమే .. కాగా ఇప్పుడు ఆ చరిత్ర పునావ్రుతం కాకూడదు అని చిరు అభిమానులు దగ్గరనుండి , చిరు కుటుంబం వరకు చాల కష్ట పడుతున్నారు .

చిరు చాలా ఏళ్ళ తర్వాత రీఎంట్రీ ఇస్తుండటం, అందున ఇది చిరు 150 సినిమా కావటం తో విమర్శలు రాకూడదని ,కచ్చితంగా విజయం సాధించాలని తమిళ సినిమా కత్తిని రిమేక్ చేస్తున్న విషయం విదితమే . కాని బాలయ్య 100 సినిమాని చాల కష్టంతో కూడుకొని తెలుగు వారి ఘన చరిత్ర తెలియచేసే కథాంశంతో వస్తున్నాడు .
ఇలా ఇద్దరు ఒక్క రోజు తేడాతో వస్తుండటంతో థియేటర్స్ కొరత ఏర్పడింది. అందునా దిల్ రాజు తన సినిమా కోసం థియేటర్స్ ని బ్లాక్ చేసి ఉంచిన విషయం అందరికి తెలిసిన రహస్యం. ఇప్పుడు తాజాగా చిరంజీవి సినిమా థియేటర్స్ కోసం అల్లు అరవింద్ రంగం లోకి దిగాడు అని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆశించిన రీతిలో ట్రైలర్ కి స్పందన రాకపోవటంతో మొదటి వారం కలక్షన్ల తో సేఫ్ జోన్ లోకి వెళ్ళాలని భావిస్తున్నారట అందులో బాగంగా అల్లు అరవింద్ తనకున్న పలుకు బాడితో గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా థియేటర్స్ ని తన ఆధీనంలోకి తెచ్చుకుంటున్నాడట .

ఈ విషయం తెలుసుకున్న బాలయ్య అభిమానులు ఆవేశంతో రగిలి పోతూ , బాలయ్య సినిమాతో నే మీకు బుద్ది చెబుతాం అంటూ సోషల్ మీడియా లలో రెచ్చి పోతున్నారు .