jio-feature-phone

Reliance jio Feature phone RS. 1500/- only

Reliance jio Feature phone RS. 1500/- only
అత్యంత చవక అయిన ‘జియో’ ఫీచర్ ఫోన్.. ఇదిగో ఫొటో.. ఫీచర్లు.. ధర ఎంతో తెలుసా!!

మాములుగా రిలయన్స్ ఏ బిజినెస్ లోకి అడుగు పెట్టినా సిద్ధాంతం ఒక్కటే.. తనకు పోటీ లేకుండా ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెట్టడమే.. ఇదే స్ట్రాటజీని టెలీ కమ్యూనికేషన్ రంగంలోనూ మరింత తీవ్రంగా అమలుచేస్తోంది రిలయన్స్ యాజమాన్యం.. జియోతో అడుగు పెట్టినప్పటి నుంచే ప్రత్యర్థుల్లో ముచ్చమటలు మొదలైన సంగతి తెలిసిందే.. దీనితో ఇప్పటి దాకా తమకు లాభాల పంట పండిస్తున్న ప్లాన్ లు అన్నీ మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు తాజాగా తన సొంత ఫీచర్ ఫోన్ ద్వారా వోల్టీ సర్వీస్ అందించేందుకు జియో సిద్ధం అయింది. దీంతో తమ అమ్మకాలు అమాంతం పడిపోయే ప్రమాదం ఉందని ఫోన్ల తయారీ కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. ఆ ఫోన్ కు సంబంధించిన ఇమేజెస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

రిలయన్స్ జియో విడుదల చేస్తున్న ఫీచర్ ఫోన్ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొనగా.. తాజాగా ఈ ఫోన్ కు సంబంధించిన ఫొటోలు ఇంటర్నెట్ లో అనధికారికంగా బయటకు వచ్చాయి. ఈ ఫోన్ ప్రత్యేకతలు ఏమిటంటే.. కీబోర్డుతో ఈ ఫోన్ వస్తుంది. ఇందులో మైజియో, జియో టీవీ, జియో సినిమా, జియో మ్యూజిక్ ల కోసం ప్రత్యేక బటన్స్ ఉండగా.. దీని విలువ దాదాపు రూ. 1500 ఉంటుందని సమాచారం.

Post Author: