4g-smart

Below 5000 Rs/- BEst 4G Smart Phones

Below 5000 Rs/- BEst 4G Smart Phones
రూ.5 వేల లోపు 4జీ సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్‌లు ఇవే…

తక్కువ ధరలో 4జీ సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? ఫీచర్లు ఏవైనా ఫర్వాలేదు.. సర్దుకుపోవచ్చని భావిస్తున్నారా? మరీ అంత తీసేయలేని ఫీచర్లు కాకపోయినా పెట్టిన ధరకు తగిన సంతృప్తి కలిగించేలా చాలా ఫోన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అలాంటి పది రకాల బడ్జెట్ ఆండ్రాయిడ్ 4జీ స్మార్ట్‌ఫోన్లు ఇవి…. ఓ లుక్కేయండి!

1. స్వైప్ కనెక్ట్ 4జీ (Swipe Konnect 4G)
ధర: రూ. 2799
అన్నిటిలోకెల్లా అతి తక్కువ ధరలో 4జీ వోల్ట్ (VoLTE ) సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్ ఇది. నాలుగు అంగుళాల ఎఫ్‌డబ్ల్యూవీజీఏ డిస్ప్లే, 1.5GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్, 512 ఎంబీ ర్యామ్, 8 జీబీ అంతర్గత మెమరీ (32 జీబీ ఎక్స్పాండబుల్ మెమరీ), ఎల్ఈడీ ఫ్లాష్‌తో 5 మెగాపిక్సల్ రియర్ కెమెరా, 1.3 ఎంపీ ఫ్రంట్ కెమేరా, వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. బ్యాటరీ సామర్థ్యం 2000 ఎంఏహెచ్

2. జెన్ ఎడ్మైర్ థ్రిల్ (Zen Admire Thrill )
ధర: రూ.4,670
ఆండ్రాయిడ్ మార్ష్‌మాలో ఓఎస్‌తో పనిచేయడం జెన్ ఎడ్మైర్ థ్రిల్ ప్రత్యేకత. 4.5 అంగుళాల డిస్ప్లే, 1.3GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1 జీబీ రామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమరీ (మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 32 జీబీకి పెంచుకోవచ్చు) తదితర ఫీచర్లు ఉన్నాయి. 5ఎంపీ కెమేరా, 2 ఎంపీ ఫ్రంట్ కెమేరా గల ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 1,750 ఎంఏహెచ్.

3 మైక్రోమ్యాక్స్ వీడియో 1 (Micromax Vdeo 1)
ధర: రూ. 4,440
మైక్రోమ్యాక్స్ వీడియో 1 స్మార్ట్ ఫోన్‌లో 4 అంగుళాల డిస్ప్లే, 1.3GHz క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ అంతర్గత స్టోరేజీ తదిత ఫీచర్లున్న ఈ ఫోన్… ఆండ్రాయిడ్ 6.0 మార్షమాలో ఆపరేటింగ్ సిస్టం (ఓఎస్)తో పనిచేస్తుంది. 5 ఎంపీ వెనుక కెమేరా, 2 ఎంపీ ఫ్రంట్ కెమేరాలున్న ఈ ఫోన్‌కు గూగుల్ డుయో వీడియో కాలింగ్ యాప్ ముందుగానే జతచేయడం అదనపు ఆకర్షణ. బ్యాటరీ సామర్థ్యం 1800 ఎంఏహెచ్.

4. మైక్రోమ్యాక్స్ కాన్వాస్ స్పార్క్ 4జీ (Micromax Canvas spark 4G)
ధర: రూ. 3,300
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ దీని ప్రత్యేకత. 5 అంగుళాల ఎఫ్‌డబ్ల్యూవీజీఏ డిస్ప్లే, 1.3 GHz క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ మెమరీ, (32 జీబీ ఎక్స్పాండబుల్ మెమరీ), 5 ఎంపీ వెనుక కెమేరా, 2 ఎంపీ ఫ్రంట్ కెమేరా, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

 

5. రిలయన్స్ విండ్ 7ఐ (Reliance Wind 7i)
ధర : రూ. 4999
5 అంగుళాల హెచ్‌డీ డిస్ప్లే దీని ప్రత్యేకత. ఇది రిలయన్స్ జియో విడుదల చేసిన బడ్జెట్ ఫోన్. క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 210 ప్రాసెసర్‌ గల ఈ స్మార్ట్‌ఫోన్‌లో 1 జీబీ ర్యామ్, 8జీబీ అంతర్గత మెమరీ (128 జీబీ ఎక్స్పాండబుల్ మెమరీ) తదితర ఫీచర్లున్నాయి. ఆండ్రాయిడ్ మార్ష్‌మాలో 6.0తో పనిచేస్తుంది. 8 ఎంపీ వెనుక కెమేరా, 5 ఎంపీ ముందు కెమేరా, 2,250 సామర్థ్యం గల బ్యాటరీ అదనపు ఆకర్షణలు.

6. జోలో ఎరా 2 (Xolo Era 2)
ధర : రూ. 4,499
4పీ లార్గాన్ లెన్స్‌తో పనిచేసే వెనుక కెమేరా దీని ప్రత్యేకత. 5 అంగుళాల డిస్ప్లే, 1.3 GHz క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ మెమరీ, (128 జీబీ ఎక్స్పాండబుల్ మెమరీ), 5 ఎంపీ వెనుక కెమేరా,5 ఎంపీ ఫ్రంట్ కెమేరా, 2350 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ మార్ష్‌మాలో 6.0 ఓఎస్‌తో పనిచేస్తుంది.

7.ఇంటెక్స్ ఆక్వా ఎస్‌2 (Intex Aqua S2)
ధర : రూ. 4990
వేలిముద్రల సెన్సార్‌తో పనిచేసే చౌకధర ఫోన్ ఇది. 5 అంగుళాల డిస్ప్లే, 1.2 GHz క్వాడ్‌కోర్ స్పెక్ట్రమ్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ మార్ష్‌మాలో 6.0 ఓఎస్‌, 1 జీబీ ర్యామ్, 8జీబీ అంతర్గత మెమరీ (32 జీబీ ఎక్స్పాండబుల్ మెమరీ) తదితర ఫీచర్లున్నాయి. 5 ఎంపీ వెనుక కెమేరా,5 ఎంపీ ఫ్రంట్ కెమేరా, 2450 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం దీని ప్రత్యేకతలు.

8.అల్కాటెల్ పిక్సి4(5) (Alcatel Pixi 4 (5) )
ధర : రూ. 4999
5 అంగుళాల డిస్ప్లే, 1 GHz క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ మార్ష్‌మాలో 6.0 ఓఎస్‌, 1 జీబీ ర్యామ్, 8జీబీ అంతర్గత మెమరీ (32 జీబీ ఎక్స్పాండబుల్ మెమరీ) తదితర ఫీచర్లున్నాయి. 2000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో పనిచేసే ఈ ఫోన్‌కు 8 ఎంపీ కెమేరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమేరా అదనపు ఆకర్షణ.

9. స్వైప్ ఎలైట్ 2 ప్లస్ (Swipe Elite 2 Plus)
ధర : రూ. 4,444
తక్కువ ధరలో 4జీ వోల్ట్ (VoLTE ) సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్లలో ఇది కూడా ఒకటి. క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8జీబీ అంతర్గత మెమరీ (32 జీబీ ఎక్స్పాండబుల్ మెమరీ)తో ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఓఎస్’తో పనిచేస్తుంది. 5 ఎంపీ కెమేరా, 2 ఎంపీ ఫ్రంట్ కెమేరా, బ్యాటరీ సామర్థ్యం 2500 ఎంఏహెచ్.

10. ఇంటెక్స్ ఆక్వా క్లాసిక్2 (Intex Aqua Classic 2)
ధర: రూ. 4,600
ఆండ్రాయిడ్ మార్ష్‌మాలో 6.0 ఓఎస్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్లో…
5 అంగుళాల హెచ్‌డీ డిస్ప్లే, 1.2 GHz క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8జీబీ అంతర్గత మెమరీ, 5 ఎంపీ వెనుక కెమేరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమేరా, 2200 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం దీని ప్రత్యేకతలు.

Post Author: