tn-govt-ban-cooldrinks

TN Govt Banned Coll Drinks in Theatres

TN Govt Banned Coll Drinks in Theatres..
థియేట‌ర్ల‌లో కూల్ డ్రింక్స్ బ్యాన్……

తమిళనాడులో మరో సంచలన నిర్ణయం. కూల్ డ్రింక్స్ అమ్మకాలపై కీలక నిర్ణయం తీసుకున్నాయి సినిమా థియేటర్లు. జ‌న‌వ‌రి 26వ తేదీ నుంచి పెప్సీ, కోకాకాలా లాంటి శీత‌ల పానియాలు నిషేధిస్తున్న‌ట్లు త‌మిళ‌నాడు థియేట‌ర్ య‌జ‌మానుల సంఘం అధ్య‌క్షుడు వెల్ల‌య‌న్ ప్ర‌క‌టించారు. జ‌ల్లిక‌ట్టును పెటా వ్య‌తిరేకించ‌డం, పెటాకు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా ఉన్న ప‌లువురు న‌టులు పెప్సీ కోకాకోలాల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వ్య‌వ‌హరించ‌డంతో ఆ కూల్ డ్రింక్స్‌ను థియేట‌ర్లో నిషేధిస్తున్న‌ట్లు త‌మిళ‌నాడు థియేట‌ర్ య‌జ‌మానుల సంఘం వెల్ల‌డించింది. ఇప్పటికే మదురై, విరుదునగర్‌, రామనాథపురం వంటి పలు ప్రాంతాల్లోని కొన్ని థియేటర్లలో పెప్సీ, కోలా కూల్‌డ్రింగ్‌ విక్రయాలను నిలిపివేశారు. ఈ నిర్ణయంపై ప్రేక్షకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులోని మిగతా ప్రాంతాల్లోనూ ఈ నిర్ణయాన్ని అమలు చేసే దిశగా థియేటర్ యాజమాన్యాలు ఆలోచిస్తున్నాయి. మల్టీఫ్లెక్సుల్లో డ్రింక్స్ బ్యాన్ చేస్తారా.. లేదా అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

Post Author: