passport

Now Post Officess are Passport Centres

Now Post Officess are Passport Centres
పోస్టాఫీసుల్లో పాస్ పోర్టులు

పాస్ పోర్టు పొందడాన్ని మరింత సులభతరం చేసింది కేంద్రం. విదేశీ వ్యవహారాల శాఖ, తపాలా విభాగం సమన్వయంతో పనిచేయనున్నాయి. పోస్టాఫీసుల్లో పాస్ పోర్టు సేవలు అందించేందుకు ముందుకు వచ్చాయి. దేశవ్యాప్తంగా 40 పోస్ట్ ఆఫీసులను పాస్ పోర్ట్ సేవలు అందించేందుకు సిద్ధం చేశారు. జిల్లాల్లోని ప్రధాన తపాలా కార్యాలయాలను దీనికోసం వినియోగించనున్నారు. తొలుత కర్ణాటకలోని మైసూర్, గుజరాత్ లోని దాహోద్ లో ఈ ప్రాజెక్ట్ ప్రారంభం అయ్యిందని తెలిపారు కేంద్ర కమ్యునికేషన్ల శాఖ సహాయమంత్రి మనోజ్ సిన్హా.

పాస్‌పోర్టు కావాల్సిన వాళ్లు మొదట ఆన్‌లైన్‌లో పేరును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కో దరఖాస్తుదారుడికి ప్రస్తుతం మూడు నుంచి నాలుగు నెలల సమయం పడుతోంది. కేటగిరీల వారీగా వచ్చిన దరఖాస్తుల పరిశీలనను టాటా కన్సల్టెన్సీ సర్వీస్‌కు ఔట్‌సోర్సింగ్‌కు ఇచ్చారు. ఇక బీ,సీ కేటగిరీల్లో వచ్చిన దరఖాస్తులు భారత విదేశాంగశాఖ ద్వారా పరిష్కరిస్తున్నారు. ఈ పనులను త్వరగా పూర్తి చేయడానికి తపాలాశాఖతో కలిసి పనిచేస్తోంది విదేశాంగ శాఖ. ఇప్పటికే దీనిపై కొంతమంది సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ తోపాటు.. వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని ప్రధాన పోస్టాఫీసుల్లోనూ పాస్ పోర్ట్ సేవలు ప్రారంభించే అవకాశం ఉంది. ఈ దిశగా ఇప్పటికే సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ఏడాదిలోనే రాష్ట్రంలోని పోస్టాఫీసుల్లో పాస్ పోర్ట్ సేవలు అందుబాటులోకి రావొచ్చు.

Post Author: