yogis

up cm yogi sensational comments on Triple Thalak

యోగి ఆదిత్య మరో సన్సేషనల్ కామెంట్……….
యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన కామెంట్ చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయింది లగాయితూ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ దేశవ్యాప్తంగా మన్ననలు పొందుతున్నారు ఆదిత్య. తాజాగా యోగి, ట్రిపుల్ తలాక్ అంశంపై స్పందించారు. దీనిని మహాభారతంలోని ద్రౌపది వస్త్రాపహరణంతో పోల్చారు. ఈ అంశంపై మౌనంగా ఉండటమంటే.. అది భారతంలో ద్రౌపదిని అవమానించడం లాంటిదేనన్నారు. లఖ్‌నవూలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న యోగి పై విధంగా వ్యాఖ్యానించారు. ట్రిపుల్‌ తలాఖ్‌పై దేశమంతా చర్చ జరుగుతోందని, దీనిపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయని, అయితే దీనిపై కొందరు మౌనంగా ఉంటున్నారన్నారు. ఇటువంటి విషయాల్లో మౌనంగా ఉన్నవాళ్లని చూస్తే తనకు మహాభారతంలోని ద్రౌపతి వస్త్రాపహరణం గుర్తొస్తుందన్నారు. ఆ సమయంలో ఈ పరిస్థితికి కారణమెవరు అని ద్రౌపది ప్రశ్నించగా.. దీనికి మద్దతిచ్చినవాళ్లు.. దీనిపై మౌనంగా ఉన్నవాళ్లూ దోషులే అని విదురుడు సమాధానమిచ్చాడని తెలిపారు.

అలాగే ట్రిపుల్‌ తలాఖ్‌కు మద్దతిచ్చేవాళ్లే గాక, దానిపై మౌనంగా ఉన్నవాళ్లు కూడా నేరం చేసిన వారే అవుతారన్నారు యోగి ఆదిత్యనాథ్. ట్రిపుల్‌ తలాఖ్‌కు చరమగీతం పాడాలని.. దేశమంతా ఉమ్మడి పౌరస్మృతిని తీసుకురావాలని యోగి అభిప్రాయపడ్డారు. కాగా, యూపీ ముఖ్యమంత్రి అయినప్పటినుంచి.. కాబోయే భారత ప్రధాని అంటూ యోగి ఆదిత్యకు అనుకూలంగా సోషల్ మీడియాలోనూ.. బయటా మద్దతులభిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల ప్రభుత్వ ఉన్నతోద్యోగులంతా తమ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్ లోనే చదివించాలని, లేదంటే వారికి ఇచ్చే అన్ని ప్రోత్సాహకాలు నిలిపివేస్తామని యోగి ప్రకటించి దేశవ్యాప్తంగా సంచలనం రేపారు.

Post Author: