notes

Breaking News RBI Gives One More Chance To Banned Notes

Breaking News For Banned Notes
బ్రేకింగ్ న్యూస్: రద్దైన పెద్ద నోట్ల జమకు మరో అవకాశం

రద్దైన పాత రూ.1000, రూ.500 నోట్ల జమకు ఆర్బీఐ మరో అవకాశం ఇవ్వవచ్చని ప్రభుత్వ వర్గాలు బుధవారం వెల్లడించాయి. ప్రధాని మోదీ గత ఏడాది నవంబర్ 8 నుంచి పెద్ద నోట్లు చెలామణి కావని ప్రకటించారు. రద్దు చేసిన నోట్లు బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్‌ చేసేందుకు ఇచ్చిన గడువు డిసెంబర్ 30తో ముగిసింది. ఆర్బీఐ శాఖల్లో జమకు 2017 మార్చి 31 వరకు అవకాశం ఉంది.

కాగా కొంత మంది ఎక్కడెక్కడో దాచి మరిచిపోయిన పాత రూ.1000, రూ.500 నోట్లు గడువు తర్వాత బయటపడుతున్నాయి. దీంతో వీటిని ఏమి చేయాలంటూ చాలా మంది ఆర్బీఐని సంప్రదిస్తున్నారు. మరో అవకాశం ఇవ్వాలని వారు కోరుతున్నారు.

ఈనేపథ్యంలో రద్దైన పాత నోట్ల జమకు ఆర్బీఐ మరో అవకాశం ఇవ్వవచ్చని సమాచారం. ఓ ప్రత్యేక విండో ద్వారా గరిష్టంగా రూ.2000లు నిర్ణీత గడువులోగా బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్‌కు వీలు కల్పించవచ్చని తెలుస్తోంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ఆర్బీఐ త్వరలో విడుదల చేయవచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

Post Author: