padma

Padma awards For Telugu Famous Peoples 2017

Padma awards For Telugu Famous Peoples2017
తెలుగు తేజాలకు పద్మ అవార్డులు

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధులకు ప్రతిష్ఠాత్మక పద్మ పురస్కారాలు దక్కనున్నాయి. ఈ పేర్లను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించినట్లు సమాచారం. ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందచేయనున్న పురస్కారాలకు ప్రభుత్వం మొత్తం 125 మందిని ఎంపిక చేశారు. గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ని కూడా ప్రతిష్ఠాత్మక పద్మ పురస్కారానికి ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ప్రధాని మోడీ ప్రాధాన్యమిచ్చే జాతీయ సమైక్యతకు సంబంధించి, సామాజిక రంగంలోని సమస్యల పరిష్కారంలో కృషి చేసిన వారిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. క్రీడా రంగం నుంచి పి.వి.సింధు, సాక్షి మాలిక్‌, చలనచిత్రాలు, వినోద రంగం నుంచి ఆశా పరేఖ్‌, రిషి కపూర్‌, సోనూ నిగమ్‌, శంకర్‌ మహదేవన్‌, రాజకీయ రంగం నుంచి ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్‌, భాజపా సీనియర్‌ నేత మురళీ మనోహర్‌ జోషిలను పద్మ పురస్కారాలతో సత్కరించనున్నట్లు సమాచారం. బుధవారం పద్మ అవార్డులను ప్రకటించనున్నారు.

పద్మ పురస్కారాల కోసం కేంద్ర హోం మంత్రిత్వశాఖ తొలిసారి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానించింది. రాష్ట్రాల నుంచి అందిన ప్రతిపాదనలు సహా మొత్తం 4వేల ప్రతిపాదనలు వచ్చినట్లు సమాచారం. పారదర్శకత కోసం ప్రభుత్వం నామినేషన్ల ప్రక్రియను ప్రభుత్వం ప్రజలందరికీ అందుబాటులో ఉంచింది.

Post Author: